calender_icon.png 8 January, 2025 | 10:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎక్సైజ్‌శాఖలో కొత్తగా 14 పోలీస్‌సేషన్లు

08-01-2025 01:28:44 AM

* ఈ నెలలో ప్రారంభించేందుకు సన్నాహాలు 

* ఎక్సైజ్ శాఖ అధికారులకు తగ్గనున్న పని ఒత్తిడి 

హైదరాబాద్, జనవరి 7 (విజయక్రాంతి): ఎక్సైజ్‌శాఖ కొత్తగా మరో 14 పోలీస్‌స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఈ నెలలో ప్రారంభించేందుకు సన్నహాలు చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ప్రారంభించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ పోలీస్‌స్టేషన్లను మూడేళ్ల క్రితమే ప్రారంభించాలని భావించినా.. వాటి ఏర్పాటులో చాలా ఆలస్యం జరిగింది.

రీ ఆర్గనైజేషన్ యాక్ట్ కింద సుమారుగా 85 మంది అధికారులు వివిధ హోదాల్లో పదోన్నతులు పొంది మూడేళ్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నా.. కొత్త పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేయకపోవడంతో విమర్శలను ఎదుర్కొంటోంది. త్వర గా కొత్త ఠాణాలు ఏర్పాటు చేసి పని ఒత్తిడి తగ్గించాలని పలువురు అధికారులు, ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారులకు విన్నవించుకోవడంతో రీ ఆర్గనైజేషన్ యాక్ట్ కింద ప్రభుత్వం  జీవో 113ను గతంలో విడుదల చేసింది.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 40 ఎక్సైజ్ సూపరిండెంటెంట్ కార్యాలయాలతోపాటు 139 ఎక్సైజ్ ఠాణాలు ఉన్నాయి. కొత్తగా 14 ఠాణాలు ఏర్పాటైతే అక్ర మ మద్యం, గంజాయి, గుడుంబాపై ఉక్కుపాదం మోపడంతోపాటు సమర్థవంతంగా విధులు నిర్వహించడానికి అవకాశం ఉంటుందని సం బంధిత శాఖ ఉద్యోగులు పేర్కొంటున్నారు. కొత్తగా హైదరాబాద్, సంగారెడ్డి, హనుమకొండ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు.