calender_icon.png 3 April, 2025 | 3:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త పెన్షన్ పథకం నోటిఫై

24-03-2025 11:52:44 PM

యునిఫైడ్ పెన్షన్ స్కీమ్‌తో లాభాలెన్నో..

న్యూఢిల్లీ: పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఆర్‌డీఏ) యునిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)ను నోటిఫై చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఈ పథకం తీసుకొచ్చింది. జనవరిలోనే ఈ పథకం ప్రవేశపెట్టగా తాజాగా నోటిఫై చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పెన్షన్ పథకం కింద ఉద్యోగి పదవీ విరమణకు ముందు 12 నెలల పాటు ఏ జీతం తీసుకున్నాడో ఆ జీతం బేసిక్ పేలో 50 శాతం పెన్షన్‌గా అందుతుంది.

సూపర్ ఆన్యుయేషన్ లేదా కంపెనీ పెన్షన్ ప్లాన్ అనేది కంపెనీ తన ఉద్యోగులకు అందజేసే పెన్షన్ స్కీం. ఇందులో పన్ను ప్రయోజన నిధులు ఉద్యోగి పదవీవిరమణ వరకు ఆయన నుంచే వసూలు చేస్తారు. అదే ప్రస్తుతం నోటిఫై చేసిన యూపీఎస్ అమల్లోకి వస్తే.. ఉద్యోగులకు లాభం చేకూరనుంది. యూపీఎస్ నిబంధనలు ఏప్రిల్ 1 2025 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆ తర్వాత ఉద్యోగం పొందిన వారు కూడా యూపీఎస్ కింద నమోదు చేసుకునేందుకు అర్హత సాధిస్తారు. ఏ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినైతే సర్వీసు నుంచి తొలగిస్తారో వారికి యూపీఎస్ అందుబాటులో ఉండదని పీఎఫ్‌ఆర్‌డీఏ నోటిఫికేషన్‌లో పేర్కొంది.