- పార్టీలో పట్టుకోసం మహేశ్ నయా ప్లాన్
- గాంధీభవన్‌కు సీఎం, మంత్రులు రావాలె
- బుధ, శుక్ర వారాల్లో ఒక్కో మంత్రి
- వచ్చే వారం నుంచే అమలులోకి ప్లాన్
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): పీసీసీ నూతన అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ తన మార్కును చూపించాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఒక వైపు పార్టీని మరింత పటిష్ఠం చేసేందుకు కార్యాచరణను ప్రకటించాలనే ఆలోచనతో ఉంటూనే.. మరోవైపు పార్టీకి, ప్రభుత్వానికి మధ్య గ్యాప్ లేకుండా చూడాలనే ప్రయత్నంలో నయా విధానాన్ని అవలంభించాలనే ఆలోచనతో ఉన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నెలకోసారి, మంత్రులు వారానికి రెండు రోజులు గాంధీభవన్‌కు రావాలని పీసీసీగా బాధ్యతలు చేపట్టిన రోజే మహేశ్ సూచించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు దాన్ని అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం మంత్రులు వారానికి ఒక్కో మంత్రి రెండు రోజులు అంటే బుధ, శుక్రవారాల్లో గాంధీభవన్‌కు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్లాన్‌ను వచ్చే వారం నుంచి అమలు చేయాలనే ఆలోచనతో ఉన్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లను చేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా నెలకోసారి గాంధీభవన్‌కు వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పార్టీకి, ప్రభుత్వానికి మధ్య మరింత సమన్వయం పెరుగనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కార్యకర్తలకు న్యాయం..
గతంలో పీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన నాయకులు ప్రతిపక్షంలో ఉండగా నిత్యం గాంధీభవన్‌లోనే ఉండి పార్టీ కార్యక్రమాల ను చూస్తుండే వారు. అధికారంలోకి వచ్చాక సీఎం పదవో లేదంటే ఇతర పదవులు వస్తే సచివాలయానికే పరిమితమయ్యేవారు. దీంతో పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కష్టపడిన పార్టీ శ్రేణులు ప్రభుత్వ పెద్దల వద్దకు వెళ్లడానికి ఇబ్బందిగా ఉండేదని చెబుతున్నారు. సీఎంతో పాటు మంత్రులు కూడా పార్టీ కార్యాలయానికి వస్తే కార్యకర్తలు సమస్యలు చెప్పుకోవడానికి మంచి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రాంతీయ పార్టీ అధికారంలోఉంటే సీఎం పదవి, పార్టీ చీఫ్ పదవి ఒక్కరికే ఉంటుందని, దీంతో పార్టీ శ్రేణులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అంటున్నారు.
జాతీయ పార్టీ మాత్రం అధికారంలో ఉంటే రెండు పవర్ సెంటర్స్ ఉం టాయి. మొన్నటి వరకు పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ కూడా గాంధీభవన్ వేదికగానే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుండే వారు. ఇప్పు డు సీఎం కావడంతో సచివాలయానికే పరిమితమవుతున్నారు. నెలకోసారి గాంధీభవ న్‌కు రావడవం వల్ల కార్యకర్తల సమస్యలు వినడానికి అవకాశం ఉంటుందని, వారిని న్యాయం చేసేందుకు అస్కారం ఏర్పడుతుందని ఆలోచనతో పార్టీ శ్రేణులు ఉన్నారు.