calender_icon.png 15 February, 2025 | 5:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త నోటిఫికేషన్లు జూన్ తర్వాతే!

15-02-2025 01:13:45 AM

  1. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, ఆ తర్వాత స్థానిక ఎన్నికలు
  2. ప్రకటనకే పరిమితమైన జాబ్ క్యాలెండర్
  3. నోటిఫికేషన్లపై స్పష్టత ఇవ్వాలంటున్న నిరుద్యోగులు

హైదరాబాద్, ఫిబ్రవరి 14 (విజయక్రాంతి): రాష్ట్రంలో కొత్త నోటిఫికేషన్ల కోసం అభ్యర్థుల ఎదురుచూపుల పర్వం కొనసాగేటట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ,  ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏడు ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి ఉంది.

ఫిబ్రవరి 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అంతవరకూ కొత్త నోటిఫికేషన్లు వచ్చే పరిస్థితిలేదు. ఇక రిజర్వే షన్ల అంశం ఉండనే ఉంది. ఎస్సీ రిజర్వేషన్లు తేలందే కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకూడదని ఆ వర్గం డిమాం డ్ చేస్తున్నది. మరోవైపు కులగణన సర్వే లో బీసీల జనాభా తగ్గడంతో మళ్లీ ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు రీసర్వే చేపడుతున్నారు.

బీసీల రిజర్వేషన్ల లెక్క కూడా తేలాల్సి ఉంది. ఇది తేలితేగాని స్థానిక సంస్థ ఎన్నికలు జరిగే పరి స్థితి లేదు. ఏప్రి ల్ లేదా మేలో ఆ ఎన్నికలు జరగవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ సంగతి ఏమిటని అభ్యర్థులు ప్రశ్నిస్తు న్నారు. ఏ ప్రభుత్వమొచ్చినా ఇలా నోటిఫికేషన్ల కోసం ఎదురుచూడడమే తమ వంతు అయిందని ఆవేదన చెందుతున్నారు.

జాబ్ క్యాలెండర్‌ను పక్కాగా ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నిస్తున్నారు. వయోపరిమితి మిం చిపోతుం డటంతో చాలా మంది చివరి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఉద్యోగం రాక తిరిగి సొంత ఊరికి వెళ్లలేక.. అయినవాళ్లకు మొహం చూపించలేక నరకయాతన పడుతున్న వేలాది మంది నిరుద్యోగ యువత అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, చిక్కడపల్లి, దిల్‌సుఖ్‌నగర్, అమీర్‌పేట్, హిమాయత్‌నగర్ పరి సర ప్రాంతాల్లో ఉన్నారు.

ఉద్యోగ నోటిఫికేషన్లు ఎంత ఆలస్యమైతే తమపై ఆ స్థాయిలో ఆర్థికభారం, ఒత్తిడి, ఆందోళన ఎక్కువవు తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు మార్చిలో పూర్తి అయితే మేలో గ్రూప్స్, డీఎస్సీ నోటిఫికేషన్లు వస్తాయని నిరుద్యోగులు భావించారు. కానీ ఎన్నికలు మే లేదా జూన్‌లో జరిగితే నోటిఫికేషన్లకు మరింత ఆలస్యమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు వేస్తారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.