calender_icon.png 15 March, 2025 | 5:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సొంత బ్యానర్‌లో కొత్త సినిమా

11-03-2025 12:00:00 AM

శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం నానితో ‘ది ప్యారడైజ్’ చిత్రం తో పాటు చిరంజీవితో తన మూ డో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు తన సొంత బ్యానర్‌ను ప్రారంభించటం ద్వారా చిత్ర నిర్మా ణం వైపు అడుగుపెడుతున్నారు. ‘సమ్మ క్క సారక్క క్రియేషన్స్’ పేరుతో సొంతంగా కొత్త బ్యానర్‌ను ప్రారంభించిన ఆయన ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీనికి కథను సైతం ఆయనే అందిస్తుంటం విశేషం.

చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్‌కు చెందిన అనురాగ్‌రెడ్డి, శరత్‌చంద్రల నిర్మాణ భాగస్వామ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాతో చేతన్ బండి డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ చి త్రబృందం ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. తద్వారా ఈ సిని మా టైటిల్ ‘ఏఐ అమీనా జరియా రుక్సానా గులాబీ’ అని ప్రకటించారు. ఈ పోస్టర్‌లో నల్లటి చీరలో ఒక అమ్మాయి సరిహద్దు వెంట నడుస్తుండగా.. ఎర్ర గులాబీలు చెల్లాచెదురుగా పడి ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.