calender_icon.png 30 April, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమావాస్య అన్నప్రసాద వితరణ

28-04-2025 01:45:16 AM

  1. కొత్త పేట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదానం 

హాజరైన టీ పీసీసీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ ఉప్పల

ఎల్బీనగర్, ఏప్రిల్ 27 : అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ మహిళా విభాగ్ ఆధ్వర్యంలో ఆదివారం అమావాస్య అన్నప్రసాద వితరణ నిర్వహిం చారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ న్యూఢిల్లీ అడ్వైజరీ బోర్డ్ సెంట్రల్ కమిటీ చైర్మన్ గంజి రాజమౌళి గుప్తా  ధర్మపత్ని అమృతమ్మ జ్ఞాపకార్థం అమావాస్య సందర్భంగా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీ పీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్, టూరిజం కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా పాల్గొన్నారు.

కొత్త పేట ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో అమావాస్య అన్నప్రసాద వితరణ నిర్వహించారు. అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ మహిళా విభాగ్ అధ్యక్షురాలు ఉప్పల స్వప్న, చందా భాగ్యలక్మి, ప్రధాన కార్యదర్శి మంజుల, కోశాధికారి  శేగు నళిని కుమారి, చీఫ్ అడ్వైజర్ కలకొండ మణిమాల , అడిషనల్ కోశాధికారి పోలా అర్చన, సేవాదళ్ చైర్ పర్సన్ పద్మజ, ఈసీ సభ్యురాలు గోలి సరిత, భార్గవి తదితరులు పాల్గొన్నారు.