28-04-2025 01:43:27 AM
మేడ్చల్, ఏప్రిల్ 27(విజయక్రాంతి): శ్రీపాద వల్లభ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏడు గుళ్ల అమ్మవారి ఆలయం వద్ద అమావాస్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీపాద వల్లభ ట్రస్ట్ చైర్మన్ తాళ్లపల్లి రమేష్ గుప్తా, నరేంద్ర చారి, నర్సింలు పటేల్, లింగ శ్రీనివాస్, జమలాల్ నాయక్, లింగ జగదీష్, సంతోష్, రమేష్, కజ్జం సంపత్, బాలకృష్ణ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.