ఆదిలాబాద్,(విజయక్రాంతి): సంక్షేమ ఎస్టీ హాస్టలలో కొత్త మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని టీజీవీపీ రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ కొట్టూరి ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ ఎస్సి, ఎస్టీ, బీసీ హాస్టల్ లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేసిన కొత్త మెనూను ఆదిలాబాద్ జిల్లాలలో ఇంచార్జీ మంత్రి సీతక్క ప్రారంభించారన్నారు. కానీ ఇప్పటి వరకు ఆ మెనూ అమలు చేయడం లేదని కొందరు హాస్టల్ విద్యార్థులు వాపోతున్నారని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న హాస్టల్లో కొత్త మెనూ ప్రకారం విద్యార్థులు ఆహారాన్ని అందిస్తాలేరని ఆరోపించారు. కొత్త మెనూ అందించని పక్షంలో విద్యార్థుల పక్షాన పోరాడతామన్నారు.