calender_icon.png 6 March, 2025 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథని డివిజన్ నూతన మీడియా ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

06-03-2025 05:46:40 PM

మంథని (విజయక్రాంతి): మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గంను గురువారం మంథని పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో గురువారం ఎన్నుకోవడం జరిగింది. మంథని డివిజన్ ప్రెస్ క్లబ్ మీడియా అధ్యక్షునిగా మోతుకూరి శ్రీనివాస్ (సాక్షి) ఉపాధ్యక్షులుగా జబ్బర్ ఖాన్, (ఆంధ్రప్రభ) బొల్లవరం విజయానందరావు, (ఆంధ్రప్రభ) ప్రధాన కార్యదర్శిగా కొడారి మల్లేష్ యాదవ్, (విజయ క్రాంతి) సహాయ కార్యదర్శులుగా మాదరబోయిన కిషన్, (దిశ) మాటేటి కుమార్, (జనం సాక్షి) కోశాధికారిగా గడిపెల్లి అజయ్, (సర్కార్) కార్యవర్గ సభ్యులుగా మత్స్య శివప్రసాద్, (ఈనాడు రూరల్) గువ్వల రమేష్, (వార్త రూరల్) వెల్మరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, (మనం) శ్రీనివాస్ గౌడ్ (సూర్య వెలుగు) కాటా వినయ్ గౌడ్, (సాక్షి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తుందని అన్నారు. రాజకీయాలకు అతీతంగా, సామాజిక స్పృహతో ఇజాలు లేని నిజాలకు ప్రాధాన్యం ఇస్తూ నూతన ఒరవడికి శ్రీకారం చుడుతుందని అన్నారు. సభ్యులకు ఇన్సూరెన్స్, హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు, ఇల్లు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు ముందుండి ఈ క్లబ్ పనిచేస్తుందని అన్నారు. మంథని డివిజన్ ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, అధికారులు అనధికారులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు ఆదరించి ఈ క్లబ్ ను ఆశీర్వదించాలని ఈ సందర్భంగా డివిజన్ పాత్రికేయులకు కోరారు.