calender_icon.png 5 February, 2025 | 10:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిపాలన సౌలభ్యం కోసమే నూతన మండలాలు...

05-02-2025 07:39:32 PM

తహసీల్దార్ కార్యాలయాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్... 

ఆదిలాబాద్ (విజయక్రాంతి): విస్తీర్ణంలో పెద్దగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో ప్రజల సౌకర్యార్థమే, పరిపాలన సౌలభ్యం కోసం నూతన మండలాలను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. అదిలాబాద్ జిల్లాలో నూతనంగా ఏర్పడిన బోరజ్, సాత్నాల మండలాల్లో నూతన తహసీల్దార్ కార్యాలయాలను బుధవారం కలెక్టర్ ప్రారంభించారు. గ్రామాలకు వచ్చిన కలెక్టర్ కు గ్రామస్తులు డప్పు చప్పులతో ఘనంగా స్వాగతం పలికారు. పరిపాలన ప్రక్రియ ప్రారంభం అయ్యాయి. జైనథ్ మండలం నూతనంగా ఏర్పడిన బోరజ్, సాత్నాల మండలాల నూతన తహసీల్దార్ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ ప్రారంభించి, ప్రత్యేక పూజలు చేశారు. బోరజ్ నూతన తహసీల్దార్ గా రాజేశ్వరీ, సత్నాల మండలం నూతన తహసీల్దార్ గా విశ్వనాథ్ బాధ్యతలను స్వీకరించారు. వీరికి కలెక్టర్ తో పాటు మండల అధికారులు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామల దేవి, ఆర్డీఓ వినోద్, జడ్పీ సీఈఓ జితేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.