calender_icon.png 31 October, 2024 | 4:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రుణమాఫీ లబ్ధిదారులకు కొత్త రుణాలు

30-07-2024 02:15:40 AM

కౌడిపల్లి, జూలై 29: రుణమాఫీ లబ్ధిదారులకు మెదక్ డీసీసీబీ చైర్మన్ బాన్సువాడ గోవర్ధన్‌రెడ్డి, వైస్ చైర్మన్ చిన్నంరెడ్డి చేతులమీదుగా సోమవారం కౌడిపల్లిలోని మహ్మద్‌నగర్ డీసీసీబీలో కొత్త రుణాల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. డీసీసీబీ బ్యాంకులో 1159 మంది రైతులు పంట రుణాలను పొందారని, వారిలో మొదటి విడతగా 502 మంది రైతులకు రుణమాఫీ జరిగిందన్నారు. మిగిలిన వారికి మిగతా విడతల్లో రుణమాఫీ జరగనున్నట్లు తెలిపారు. తిరిగి పంట రుణాలు కావాలనుకున్న రైతులకు వెంటనే రుణాలు మంజూరు చేస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ ప్రద్యుమ్నరెడ్డి, సొసైటీ డైరెక్టర్లు గొల్ల మల్లేశం, చింతల నర్సింలు, పోచయ్య, రమేశ్, రైతులు పాల్గొన్నారు.