మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): రాష్ట్రంలో రుణమాఫీ లబ్ధి పొందిన రైతులకు త్వరగా కొత్త రుణాలు ఇవ్వాలని అధికారులకు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశించారు. గతంలో వివిధ డీసీసీబీలలో కొంతమంది అధికారులు, పా లకవర్గాల నిర్లక్ష్యంతో కొన్ని తప్పులు జరిగాయని, అలాంటి తప్పులు పునరావృతం కా కుండా చూసుకోవాలని సూచించారు.
సహకార సంఘాలు అద్భుత పనితీరు చూపి రైతుల పురోగతిలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. ఆదివారం అబిడ్స్‌లోని టీజీ క్యాబ్ ప్రధాన కార్యాలయంలో అధ్యక్షుడు మార్నేని రవీందర్‌రావు ఆధ్వర్యంలో జరిగిన నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణకు ముఖ్యఅతిథిగా హాజరై రైతు రుణమాఫీతో పాటు బ్యాంక్ పనితీరు, ఆర్థిక అంశాలపై సమీక్షించారు.
రైతులకు మెరుగైన సేవలందించినప్పుడే అధికారులకు, ప్రభుత్వానికి గుర్తింపు లభిస్తుందన్నారు. సమావేశంలో టీజీ క్యాబ్ ఎండీ గోపీ, సహకార డైరెక్టర్ కోఆపరేటివ్ రిజిస్ట్రార్ ఉదయ్‌కుమార్, పాలకవర్గ సభ్యులు కొత్త కుర్మ సత్తయ్య, ఆదిలాబాద్ డీసీసీబీ అధ్యక్షుడు ఆది బోజారెడ్డి, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు దొండపాటి వెంకటేశ్వర రావు, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.