calender_icon.png 17 October, 2024 | 10:07 AM

వడ్డీ కోసమే కొత్త అప్పులు

17-10-2024 01:41:42 AM

అప్పులు మీరు చేసినవే

కేటీఆర్‌పై మంత్రి సీతక్క ఆగ్రహం

హైదరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): గత పాలకులు చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి కొత్త అప్పులు చేయాల్సిన దుస్థితిని వచ్చిందని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కేటీఆర్ చేసిన ట్వీట్‌పై మంత్రి సీతక్క స్పందిస్తూ అప్పుల వారసత్వానికి ఆద్యులే మీరని మండిపడ్డారు.

బీఆర్‌ఎస్ హయాం లో అక్షరాల రూ.7 లక్షల కోట్ల అప్పులు చే శారని, వా టికి కిస్తీలు, వడ్డీల కోసం ప్రతి రో జు టంఛన్‌గా రూ.207 కోట్లు చెల్లించాల్సి వస్తోందన్నారు. రూ.5 వేల కోట్ల ఫీ రీయింబర్స్‌మెంట్ బకాయిలు, ఆరోగ్య శ్రీ, కాం ట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు, సర్పంచులకు పెండింగ్ బకాయిలు, విద్యు త్ సంస్థలకు బకాయిలు, ఆర్టీసీకి బకాయిలు, గురుకుల భవనాల ఓనర్లకు అద్దె బకాయిలు పెండింగ్‌లో పెట్టి ఇప్పుడు బుకాయిస్తున్నారన్నారు.