నియామకపత్రాల అందజేతకు కసరత్తు
హైదరాబాద్, నవంబర్ 3 (విజయక్రాంతి): త్వరలోనే ప్రభుత్వ జూని యర్ కాలేజీలకు కొత్త సార్లు రాబోతున్నారు. ఇందుకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. త్వరలో నే వీరికి నియామక పత్రాలను అందజేసేందుకు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలోని చాలా కాలేజీల్లో సరిపడా అధ్యాపకులు లేరు.
దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. కొన్ని సబ్జెక్టులకు లెక్చరర్లే లేని పరిస్థితి జిల్లాల్లో ఉంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 1,392 లెక్చర ర్ పోస్టుల భర్తీకి 2022లో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. నిరుడు సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో రాత పరీక్షలు నిర్వహించారు. ఇటీవలే టీజీపీఎస్సీ ఫలితాలను విడుదల చేసింది.
సబ్జెక్టుల వారీగా అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను కూడా పూర్తిచేశా రు. తుది ఫలితాలు ప్రకటించి, నియామకపత్రాలు అందించాల్సి ఉంది. రాష్ట్రంలో మొత్తం 5,395 జేఎల్ పోస్టులు మంజూరు కాగా ప్రస్తుతం 3,671 మంది లెక్చరర్లు పనిచేస్తున్నా రు. తాజాగా 1,392 పోస్టులు భర్తీతో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అధ్యాపకుల కొరత తీరనుంది.