calender_icon.png 2 November, 2024 | 7:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతిపక్షం లేకుండా చేద్దామనే కొత్త చట్టాలు

03-07-2024 12:33:14 AM

హాజీపూర్ ఘటన కలిచివేసిందన్న వీహెచ్.. 

నాలుగేళ్లవుతున్నా న్యాయమేదంటూ ఆవేదన

హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): ఎన్డీయే ప్రభుత్వం ప్రతిప క్షాలను అణదొక్కేందుకే కొత్త చట్టాలు తీసుకొచ్చినట్టు ఉందని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు ఆందోళన వ్యక్తంచేశారు. యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో  ముగ్గురు అమ్మాయిలపై అత్యాచారం, హత్య ఘటన మర్చిపోలేనిదన్నారు. నాలుగేళ్లు అవుతున్నా ఆ కేసులో న్యాయం జరగలేదన్నారు.

ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. అమ్మాయిలపై అఘాయిత్యానికి పాల్పడి, హత్యచేసిన నిందితుడిని శిక్షించాలని నల్లగొండ కోర్టు  తీర్పు ఇచ్చిందని.. డీజీపీ కేసును సీరియస్‌గా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై హైకోర్టు న్యాయమూర్తికి లేఖ రాయనున్నట్లు  పేర్కొన్నారు.  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పార్లమెంట్‌లో వాస్తవాలు మాట్లాడారని, హిందువుల మధ్య విద్వేషాలు పెంచొద్దని, హింసను ప్రోత్సహించొద్దని ఆయన సూచించారన్నారు. న్యాయం కోసం రాహుల్ మాట్లాడితే.. ఆయన ఎందుకు క్షమాపణ చెప్పాలని నిలదీశారు.