22-04-2025 11:32:56 PM
కలెక్టర్ అభిలాష అభినవ్..
నిర్మల్ (విజయక్రాంతి): ప్రజాపాలన ప్రభుత్వం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల కేంద్రంలో భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులు కలెక్టర్ పాల్గొని ప్రసంగించారు. గతంలో ధరణిలో మూడు రోజుల పరిష్కరించేందుకు ఆంక్షలు ఉండడంతో ప్రభుత్వం వాటిని పరిష్కరించాలని ఉద్దేశంతో భూభారత చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు పేర్ల మార్పులు సర్వేనెంబర్ మిస్సింగ్ వాటిని తదితర వాటిని పరిష్కరించుకోవచ్చని సూచించారు,
సమ్మర్ క్యాంపులు సద్వినియోగం చేసుకోవాలి...
నిర్మల్ జిల్లాలో వచ్చే నెల ఒకటి నుంచి 31 వరకు నిర్వహించే సమ్మర్ క్యాంపులను సద్వినించుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులకు సూచించారు, మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో సమ్మర్ క్యాంపు పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు, నెలరోజుల పాటు గ్రామాల్లో ఈ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని ఇందులో క్రీడలు ఇతర ప్రోత్సాక అందుతుందన్నారు,