calender_icon.png 16 January, 2025 | 5:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుప్రీంకు కొత్త జడ్జీలు

17-07-2024 06:40:52 AM

న్యూఢిల్లీ, జూలై 16: సుప్రీంకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు రానున్నారు. జస్టిస్ కోటీశ్వర్ సింగ్, జస్టిస్ మహదేవ్‌ను సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమించేందుకు రాష్ట్రపతి ముర్ము అంగీకారం తెలిపారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ మంగళవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. వీరు బాధ్యతలు చేపడితే సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరుతుంది. 

మణిపూర్ నుంచి మొదటి సుప్రీం జడ్జి

జస్టిస్ కోటీశ్వర్‌సింగ్ సుప్రీంకోర్టులో న్యా యమూర్తిగా అడుగు పెట్టనున్న తొలి మణిపూర్ రాష్ట్రవాసిగా రికార్డు నెలకొల్ప నున్నారు. ఆయన ప్రస్తుతం జమ్ముకశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఆయన మణిపూర్ మొదటి అడ్వొకేట్ జనరల్ ఇబొటోంబీ సింగ్ కుమారుడు. కిరోరీమాల్ కాలేజీ, ఢిల్లీ యూనివర్సిటీలోని లా సెంటర్‌లో విద్యాభ్యాసం చేశారు.

సిసోడియా కేసులో ఈడీకి సమన్లు

ఢిల్లీ లిక్కర్ కేసులో సుదీర్ఘకాలంగా జైల్లో ఉన్న ఆప్ నేత మనీశ్ సిసోడియా పెట్టుకొన్న బెయిల్ పిటిషన్‌పై అభిప్రాయం తెలపాలని ఈడీ, సీబీఐకి సుప్రీంకోర్టు  నోటీసులు జారీచేసింది. సిసోడియా బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. పిటిషనర్ 16 నెలలుగా జైల్లోనే ఉన్నాడని, అందువల్ల బెయిల్ మంజూరు చేయాలని సిసోడియా తరఫు న్యాయవాది కోరారు. .  కౌంటర్లు దాఖ లు చేయాలని సీబీఐ, ఈడీని కోర్టు ఆదేశించింది.