వనపర్తి టౌన్, జనవరి 28: జిల్లాలో పో లీస్ అధికారులు, సిబ్బంది తమ విధులలో భాగంగా ఉపయోగించే పోలీస్ వాహనా లకు టైర్లు మరియు బ్యాటరీలు, క్రమం తప్పకుండా నిర్ణీత సమయంలో మార్చు కోవాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ సూ చించారు.
మంగళవారం జిల్లా లో పోలీస్ అధికారులు, సిబ్బంది విధుల్లో భాగంగా వినియోగిస్తున్న వాహనాలకు నూతన బ్యాటరీ, టైర్లను అందచేసినట్లు ఎస్పీ తెలి పారు. ఘటనా స్థలానికి వెళ్లే సమయంలో, ఎస్కార్ట్, నేర పరిశోధన ప్రాంతాలకు, వెళ్లే సమయంలోనూ వాహన సామర్ధ్యానికి అనుగుణంగా వాహనాలను నడపాలని, నిర్దేశించిన వేగం మించకుండా జాగ్రత్తగా ఉండాలని సిబ్బంది కి ఎస్పీ వివరించారు.
ఈ కార్యక్రమంలో వనపర్తి డిఎస్పి వెంకటే శ్వరరావు , డిసిఆర్బి డిఎస్పి ఉమా మహేశ్వ రరావు , వనపర్తి సిఐ, క్రిష్ణ, కొత్తకోట సీఐ. రాంబాబు, ఆత్మకూర్ సిఐ, శివకుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ, నరేష్, రిజర్వ్ ఇ న్స్పెక్టర్లు, శ్రీనివాస్, అప్పలనాయుడు ఎం.టి. విభాగం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.