హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మరో అంతర్జాతీయ స్టేడియం నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. స్కిల్ యూనివర్సిటీ సమీపంలో అంతర్జాతీయ స్టేడియం కట్టబోతున్నట్లు తెలిపారు. బ్యాగరికంచెలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి బీసీసీఐతో చర్చించామని సీఎం స్పష్టం చేశారు. క్రీడల కోసం బడ్జెట్ లో రూ. 321 కోట్లు కేటాయించామని వెల్లడించారు. హరియాణా తరహాలో క్రీడాకారులను ప్రోత్సహిస్తామని చెప్పారు. త్వరలోనే స్పోర్ట్స్ పాలసీని తీసుకువస్తామన్నారు. భూములు లభ్యత చూసి మండల కేంద్రాల్లో స్టేడియాలు నిర్మిస్తామని సీఎం తెలిపారు. స్పోర్ట్స్ పాలసీపై ఎవరు సలహాలు ఇచ్చినా స్వీకరిస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. లుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.