అధ్యాపకులు, విద్యార్థులతో కేంద్ర మంత్రి మజుందార్, ఎంపీ రఘనందన్‌రావు
- కేంద్ర మంత్రి డాక్టర్ సుకాంత మజుందార్
సంగారెడ్డి అర్బన్, నవంబర్ 14: ఐఐటీల్లో చదువుతున్న విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేపట్టాలని కేంద్ర ఈశాన్య ప్రాంత విద్య, అభివృద్ధి శాఖ సహాయ మం త్రి డాక్టర్ సుకాంత మజుందార్ తెలిపారు. గురువారం సంగారెడ్డి జిల్లాలోని కందిలో ఉన్న ఐఐటీ(హైదరాబాద్)లో ‘ఏక్ పేడ్ మాకే నామ్’ ప్రచారంలో భాగంగా ఆయన ఐఐటీలో మొక్కలు నాటి.. అనంతరం కల్ప న చావ్లా బ్లాక్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన పలు ప్రదర్శనలను ఆయన పరిశీలించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా విద్యార్థులు ఆవిష్కరణలు చేపట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘనందన్‌రావు, ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్.మూర్తి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.