calender_icon.png 4 November, 2024 | 11:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

3 వారాల్లో కొత్త పారిశ్రామిక పాలసీ

06-07-2024 01:23:40 AM

  • ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు 
  • ఎఫ్‌టీసీసీఐ వార్షిక ఎక్సలెన్స్ అవార్డులు ప్రదానం

హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): మూడు, నాలుగు వారాల్లో నూతన ఇండస్ట్రీ పాలసీలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటిస్తారని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. దేశంలో మొదటిసారిగా తమ ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈ పాలసీని తీసుకొస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం రెడ్‌హి ల్స్‌లోని కేఎల్‌ఎన్ ప్రసాద్ హాల్‌లో ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) 107వ వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఎఫ్ టీసీసీఐ వార్షిక ఎక్సలెన్స్ అవార్డులు 202 3 ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ము ఖ్య అతిథిగా మంత్రి హాజరై మాట్లాడారు. తమది పరిశ్రమలకు అనుకూలమైన ప్రభుత్వమన్నారు. గతంలో ప్రకటించిన రూ. 3,700 కోట్ల పరిశ్రమ ప్రోత్సాహకాలను పం పిణీ చేయలేదని, ఈ సమస్యలను తాము పరిశీలిస్తామని చెప్పారు.

రాష్ర్టంలో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రపంచానికి తెలంగాణను స్కిల్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దుతామని ఉద్ఘాటించారు. ఎఫ్‌టీసీసీఐ కృషిని ఎంపీ, డాక్టర్ మల్లు రవి అభినందించారు. ఎంపీగా అన్ని విధాలా సహకరిస్తానని హామీ ఇచ్చారు. పారిశ్రామిక అభివృద్ధి లేకుండా వృద్ధి సాధ్యం కాదన్నారు. అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు, మల్లు రవి అవార్డులను అంద జేశారు. ఇండస్ట్రీ, ఇన్నోవేషన్, ఇండివిజువల్ రంగాల్లో  21 క్యాటగిరీల్లో అవార్డులు ప్రదానం చేశారు.

ఎగుమతులు, మార్కెటింగ్, ఇన్నోవేషన్, ఆర్‌అండ్‌డీ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంప్లాయీ వెల్ఫేర్, ఏరో స్పేస్, డిఫెన్స్, టూరిజం ప్రమోషన్, మహి ళా పారిశ్రామికవేత్తలు వంటి విభాగాల్లో అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు మీలా జయదేవ్, రమాకాంత్ ఇనాని, ఎక్సలెన్స్ అవార్డుల కమిటీ చైర్ కరుణేంద్ర జాస్తి, జస్టిస్ చల్లా కోదండరాం, గోపాల్‌కృష్ణ, అజయ్ మిశ్రా, ఉదయ్ దేశాయ్ పాల్గొన్నారు.