calender_icon.png 17 November, 2024 | 6:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెళ్లైన కొత్తలో..

08-11-2024 12:00:00 AM

పెళ్లైన కొత్తలో..  తెలిసి.. తెలియక తప్పులు జరుగుతుంటాయి.. వాటిని అర్థం చేసుకొని ముందుకు సాగితే దాంపత్య జీవితం హాయిగా.. ఆనందంగా కొనసాగుతుంది. లేదంటే ఒకరి తప్పులు మరొకరు ఎంచుకుంటూ కూర్చుంటే.. జీవితాంతం మనశాంతి ఉండదు. అలా కాకుండా మ్యారేజ్ లైఫ్ సంతోషంగా ఉండాలంటే కొన్ని తప్పులు జరగకుండా చూసుకోవాలి. అవేంటో చూద్దాం.. 

* ఖర్చుల విషయంలోనూ భార్యాభర్తల మధ్య నియంత్రణ అవసరం. ఇందులో ఒక్కరు దుబారా చేసినా త ర్వాత అది వైవాహిక బంధంపై ప్రభావం చూపుతుంది. 

* పరస్పర గౌరవం వైవాహిక బంధాన్ని బలోపేతం చేస్తుంది. అగౌరవంగా ప్రవర్తిస్తే త్వరగా వారు విడిపోవడానికి దారి తీస్తుంది. 

* సంసార జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు భార్యాభర్తలు ఒకరినొకరు ఎగతాళి చేసుకోవడం, విమర్శించుకోవడం మానాలి. ఇది మరిన్ని సమస్యలకు దారితీసి వారి బంధాన్ని బలహీనం చేస్తుంది. ఈ సమయంలో ఒకరినొకరు బాసటగా నిలవాలి. 

* దంపతుల మధ్య గొడవ జరిగితే వెంటనే ఇద్దరూ మాట్లాడుకోవడం మానేస్తారు. ఇది వారి మధ్య దూరాన్ని మరింత పెంచుతుంది. పంతానికి పోవడం మాని ఎవరో ఒకరు తగ్గి మాట్లాడాలి. 

* ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో భార్యాభర్తలు ఇద్దరు పరస్పరం సహకరించుకోవాలి. ఇంట్లో అన్ని పనులూ భార్యే చేయ్యాలి అని అనుకోవద్దు. వైవాహిక జీవితం సంతోషంగా సాగాలంటే ఇద్దరూ పరస్పర సమన్వయంతో, సహకారంతో ముందుకు సాగాలి.