calender_icon.png 27 November, 2024 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన ఆలోచనలను ప్రోత్సహించాలి

27-11-2024 12:50:50 AM

డీఈవో రోహిణి

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 26 (విజయక్రాంతి): విద్యార్థుల్లో నూతన ఆలోచనలను ప్రోత్సహిం చి వారిని భావి శాస్త్రవేత్తలుగా  తీర్చిదిద్దేందుకు జిల్లాస్థాయి పదర్శనలు తోడ్పడుతాయని డీఈవో ఆర్ రోహిణి అన్నారు.

మంగళవారం.. నగరంలో సెయింట్ పైయస్ హైస్కూల్ లో ప్రధానోపాధ్యాయులు, గైడ్ టీచర్స్‌తో అవగాహన సదస్సు నిర్వహిం చారు. డిప్యూటీ ఈవో చిరంజీవి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో హైదరాబాద్ డీఈవో రోహిణి, జిల్లాసైన్స్ అధికారి ప్రభాకర్ పాల్గొని ఇన్‌స్పైర్ అవార్డ్స్ మానక్ జిల్లా స్థాయిలో సెలెక్ట్ అయిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, గైడ్ టీచర్లకు సలహాలు, సూచనలు అందించారు. డిసెంబర్ 6, 7 తేదీలలో జిల్లాస్థాయి ఇన్‌స్పైర్ అవార్డ్స్.. మానక్ జిల్లా స్థాయి బాల్ వైజ్ఙానిక్ ప్రదర్శిన ముషీరాబాద్‌లోని సెయిం ట్ పైయస్ హైస్కూల్ జరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.