* నిజామాబాద్ వెంకటేశ్వరా షోరూంలో ఆవిష్కరణ
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 30 (విజయక్రాంతి): హీరో కంపెనీ సరికొత్త హంగులతో బెస్ట్ ఇన్ క్లాస్, ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్లతో ‘కొత్త హీరో డెస్టినీ 125 సీసీ’ రిట్రో మాడల్‌ను మరలా మార్కెట్లోకి విడుదల చేసింది. గురువారం నిజా మాబాద్ వినాయక్‌నగర్‌లోని వెంకటేశ్వరా షోరూలో ఈ వాహనాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, నుడా చైర్మన్ కేశ వేణు ముఖ్య అతిథిగా, షోరూం యజమాని నల్ల మహిపాల్‌రెడ్డి, నల్ల జయరెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ.. డెస్టినీ 125 సీసీ బైక్‌ను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారని, ఇది యువతతోపాటు అందరినీ ఆకర్షించేలా తయారుచేశారని పేర్కొన్నారు. ఈ సెగ్మెంట్లోనే అత్యధిక మైలేజీ 59 కిలోమీటర్ /లీటర్, ఐకానిక్ రిట్రో డిజైన్, ఇల్లుమినేటెడ్ స్టార్ట్ స్విచ్, ఫుల్ లెడ్ ప్రొజెక్టర్ హెడ్ లాంప్ డీఆర్ఎల్తో, బ్లూటూత్‌తో ఫుల్లీ డిజిటల్ మీటర్ కాన్సోల్, ఆటో క్యాన్సల్ వింకర్స్ తదితరు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ వాహనాన్ని రూపొందించినట్టు వివరించారు.
ఈ వాహనం ఐదు రంగుల్లో అందుబాటులో ఉందని, వాహనం ఎక్స్ షోరూం ధర రూ.82,192 నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ వాహనాన్ని వినియోగదారులు ఆదరించాలని కోరారు.