మూడు రాష్ట్రాల గవర్నర్లు బదిలీ
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ, డిసెంబర్ 24: దేశంలోని పలు రాష్ట్రాలకు గవర్నర్లను కేంద్రం నియమించింది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశా రు. రెండు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు. మూడు రాష్ట్రాల గవర్నర్లను బదిలీ చేశారు. మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబును ఒడిషా గవర్నర్‌గా నియమితుల య్యారు. బీహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కేరళ గవర్నర్‌గా బదిలీ చేశారు. కేరళ గవర్నర్‌గా ఉన్న ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌ను బీహార్ గవర్నర్‌గా నియమించారు. మిజోరాం గవర్నర్‌గా జనరల్ విజయ్‌కుమార్ సింగ్‌ను, మణిపూర్ గవర్నర్‌గా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాను నియమి స్తూ రాష్ట్రపతి భవన్ ప్రకటన విడుదల చేసిం ది. ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.