అనంతగిరి,(విజయక్రాంతి): మండల పరిధిలోని కొత్త గోల్ తండా గ్రామంలో గల మూడవ అంగన్వాడి కేంద్రాన్ని 1వ అంగన్వాడి కేంద్రానికి క్లబ్ చేసినట్లు సిడిపిఓ పారిజాత తెలిపారు. గురువారం సిడిపిఓ పారిజాత(CDPO Parijatha) మాట్లాడుతూ... మూడవ అంగన్వాడి కేంద్రానికి చెందిన టీచర్ విధులకు హాజరు కాకుండా నిర్లక్ష్యం వహించడంతో పలుమార్లు షోకాజ్ నోటీసులు జారీ చేశామని, తదుపరి చర్యల నిమిత్తం జిల్లా సంక్షేమ అధికారికి రిపోర్ట్ చేశామన్నారు.
సదురు అంగన్వాడీ టీచర్ అప్స్కాండ్ లో ఉండడంతో లబ్ధిదారులకు ఇబ్బందులు తలెత్తకుండా అదేవిధంగా ప్రీ స్కూల్ పిల్లలు ముగ్గురే ఉండడంతో ఒకటవ కేంద్రానికి క్లబ్ చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా పిల్లలకి పోషకాలతో కూడిన సమతుల్య ఆహరం అందించాలని, పిల్లల సంఖ్యను అంగన్వాడీలో పెంచే విధంగా కృషిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ మంగ, ప్రెసిడెంట్ ప్రైమరీ ప్రిన్సిపాల్ మోతిలాల్, స్థానిక మాజీ సర్పంచ్ బానోతు బాబు నాయక్, టీచర్ శ్రీదేవి, అంగన్వాడి టీచర్ గంగా తదితరులు పాల్గొన్నారు.