calender_icon.png 31 December, 2024 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన జి.యం. గా భాద్యతలు స్వీకరించిన వీసం కృష్ణయ్య

01-12-2024 05:35:55 PM

ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి ఇల్లందు ఏరియా జి.యం వీసం కృష్ణయ్య సతిసమేతంగా తన చాంబర్లో వేదపండితులతో పూజ కార్యక్రమాలు నిర్వహించి ఆదివారం భాద్యతలు స్వీకరించినారు. అనంతరం ఏరియా ఉన్నతాధికారులతో, ఉద్యోగులతో పరిచయ కార్యక్రమం నిర్వహించినారు. జి.యం చాంబర్లో నూతనంగా బ్యాద్యతలు చేపట్టిన సందర్భముగా ఆయన మాట్లాడుతూ.. ఇల్లందు ఏరియా రాబోయే కాలంలో ఓసిల ద్వారా బోగ్గును వెలికితీసి 2024-25 ఏడాదికి గాను సంస్థ నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించి బొగ్గు ఉత్పత్తి చేస్తామని అలాగే ఏరియాలోని అన్ని సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కారానికి కృషి చేస్తానని అలాగే ఇల్లందు ఏరియాలో నూతన బొగ్గు బావులుతీసి ఇల్లందు పుట్టినిల్లుకు పూర్వవైభవం తెస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఓ.టు.జి.యం బొల్లం వెంకటేశ్వర్లు, జి.యం.ఆఫీసు అధికారులు, ఏరియా అధికారులు, గుర్తింపు సంఘం నాయకులు, ప్రాతినిధ్య సంఘం నాయకులు, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.