calender_icon.png 4 March, 2025 | 7:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త బ్యానర్‌లో నూతన చిత్రం ప్రారంభం

03-03-2025 01:01:35 AM

ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్ జంటగా కొత్త సంస్థ సోనుది ఫిల్మ్ ఫ్యాక్టరీ ఓ సినిమాను నిర్మించనుంది. తాజాగా ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన పూజా కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ క్లాప్ కొట్టగా తొలి షాట్‌ను దేవుని చిత్రపటాలపై తీశారు.

దర్శకులు వీరశంకర్, నవీన్ మేడారం, తనికెళ్ల భరణి స్క్రిప్ట్‌ను చిత్ర దర్శక ద్వయం కిట్టి కిరణ్, లక్ష్మీచైతన్యలకు అందించారు. ప్రొడ్యూసర్ ప్రసన్నకుమార్ టీ, వంశీ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఆర్‌యూ రెడ్డి మాట్లాడుతూ-.. ‘మా బ్యానర్‌లో నూతన దర్శకులు, మంచి కథతో వస్తున్న సినిమా ఇది.

మార్చి 6 నుంచి షూటింగ్‌ను ఊటిలో ప్రారంభింస్తున్నాం. తర్వాత రెండో షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్లాన్ చేశాం’ అని తెలిపారు. దర్శకులు కిట్టి కిరణ్, లక్ష్మీచైతన్య మాట్లాడుతూ-.. ‘ఈ సినిమాను గొప్పగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం’ అని చెప్పారు. కార్యక్రమంలో బిగ్‌బాస్ ఫేమ్ శుభశ్రీ, సంధ్య జానక్, కెమెరా మెన్ జోషి తదితరులు పాల్గొన్నారు.