07-03-2025 12:21:19 AM
పెద్దపల్లి, మార్చి 6: పెద్దపల్లి జిల్లా పంచాయతీ కార్యదర్శుల ఫోరం కమిటీ ని గురువారం పెద్దకాల్వల క్యాంపు లోని ఓ ఫంక్షన్‌హల్‌లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా డి. నిశాంత్, ప్రధాన కార్యదర్షిగా మహేందర్, అసోసియేట్ అధ్యక్షులుగా కృష్ణ, ఉమాపతి రెడ్డి, ఉపాధ్య క్షలుగా శరత్, భాను ప్రసాద్, సాగర్ రావు, శ్రవణ్, నరేష్, మసీయొద్దీన్, జాయింట్ సెక్రటరీ లుగా తిరుపతి, మౌనిక, అంజలి, సత్యనారాయణ రెడ్డి, సురేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా రాజ్‌కుమార్, కోశాధికారిగా మారుతి, ప్రచార కార్యదర్శిగా సోనియా, కల్చరల్ కార్యదర్శి గా లలిత, ఈసీ మెంబెర్ లుగా జుహిబ్, కిరణ్ కుమార్, రవి, సతీష్, టి. రవి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికలకు గాను తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ పోరం రాష్ర్ట అధ్యక్షులు సందిలా బలరాం, అసోసియేట్ అధ్య క్షులు శ్రవణ్, టిఎన్ జి వో జిల్లా అధ్యక్షులు బొంకురి శంకర్ సమక్షంలో ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్బంగా నూతన కమిటీ కి శుభాకాంక్షలు తెలుపుతూ శాలువా లతో సత్కరించారు.
ఇసుక టిప్పర్లు పట్టివేత
మంథని మార్చి 6 (విజయక్రాంతి): మంథని మండలంలోని వెంకట్ పూర్ లో గురువారం అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను ఉదయం 6 గంటలకు తరలిస్తున్న రెండు (1.TS 25 T 6542), 2.TS 25 T 6622) టిప్పర్లను పట్టుకొని కేసు నమోదు చేశామని మంథని ఎస్‌ఐ రమేష్ తెలిపారు. ఆయన కథనం మామిడి రామకృష్ణ, ములుగు జిల్లా ఇంచర్ల గ్రామానికి చెందిన పిట్టల శ్రీనివాస్ వెంకటాపూర్ మంథని మేకల రమేష్ వెంకటాపూర్ చెంది న వారిని అరెస్టు చేశామని ఎస్‌ఐ తెలిపారు.
ప్రేమ జంట ఆత్మహత్య
కరీంనగర్ క్రైం, మార్చి 6: కరీంనగర్ నగరంలోని కోర్టు సమీపంలోగల ఎరుకల వాడలో ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. చొప్పదండి మండలం చిట్యాలపల్లికి చెందిన కొండపర్తి అరుణ్ కుమార్(24), భూపాలపట్నంకు చెందిన నాంపెల్లి అలేఖ్య (21)లు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఎరుకలవాడలో నివాసం ఉండే మి త్రుడి గదిలో వీరు ఈ అఘాయిత్యానికి పా ల్పడ్డారు. మృతుడు అరుణ్ కుమార్ నగరంలోని కృష్ణసాయి ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషి యన్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరి వివాహానికి పెద్దలు ఒప్పుకోరని మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. కరీంనగర్ మూడో ఠాణా పోలీసులు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నారు.