06-03-2025 08:11:00 PM
అధ్యక్ష, కార్యదర్శులు గా నిశాంత్, మహేందర్..
పెద్దపల్లి (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా పంచాయతీ కార్యదర్శుల ఫోరం కమిటీని గురువారం పెద్దకాల్వల క్యాంపులోని ఓ ఫంక్షన్ హల్ లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులు గా డి. నిశాంత్, ప్రధాన కార్యదర్షిగా మహేందర్, అసోసియేట్ అధ్యక్షులు గా కృష్ణ, ఉమాపతి రెడ్డి, ఉపాధ్యక్షలుగా శరత్, భాను ప్రసాద్, సాగర్ రావు, శ్రవణ్, నరేష్, మసీయొద్దీన్, జాయింట్ సెక్రటరీ లుగా తిరుపతి, మౌనిక, అంజలి, సత్యనారాయణ రెడ్డి, సురేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ గా రాజ్ కుమార్, కోశాధికారి గా మారుతి, ప్రచార కార్యదర్శి గా సోనియా, కల్చరల్ కార్యదర్శి గా లలిత, ఈసీ మెంబెర్ లుగా జుహిబ్, కిరణ్ కుమార్, రవి, సతీష్, టి. రవి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికలకు గాను తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ పోరం రాష్ట్ర అధ్యక్షులు సందిలా బలరాం, అసోసియేట్ అధ్యక్షులు శ్రవణ్, టిఎన్జివో జిల్లా అధ్యక్షులు బొంకురి శంకర్ సమక్షంలో ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్బంగా నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలుపుతూ శాలువాలతో సత్కరించారు.