26-03-2025 12:08:23 AM
భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
పటాన్ చెరు, మార్చి 25: పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన పరిపాలన అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఇటీవల అమీన్ పూర్ కేంద్రంగా నూతన ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ మంజూరు అయిందని ఆయన తెలిపారు. అమీన్ పూర్ మున్సిపాలిటీతో పాటు రామచంద్రాపురం పరిధిలోని డివిజన్లు, మున్సిపాలిటీలు నూతన పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తాయని తెలిపారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్ ఏర్పాటు కోసం మంగళవారం ఉదయం అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని కిష్టారెడ్డిపేటలో గల పాత గ్రామపంచాయతీ భవనాన్ని వివిధ శాఖల అధికారులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఎక్సైజ్ శాఖ అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 1వ తేదీ నుండి కార్యకలాపాలు ప్రారంభమ వుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, మున్సిపల్ కమిషనర్ జ్యోతి రెడ్డి, ఎక్సైజ్ సీఐ పరమేశ్వర్ గౌడ్, సత్యనారాయణ, ఏఈ ప్రవీణ్, పాల్గొన్నారు.