calender_icon.png 16 January, 2025 | 10:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన ఉద్యోగులు ఉన్నత స్థాయికి ఎదగాలి

16-01-2025 06:01:53 PM

సింగరేణి ఏరియా జిఎం దేవేందర్...

మందమర్రి (విజయక్రాంతి): సింగరేణిలో కారుణ్య నియామకం ద్వారా నూతనంగా ఉద్యోగాలు పొందిన యువ కార్మికులు కష్టపడి పనిచేసి ఉన్నత స్థాయికి ఎదగాలని సింగరేణి ఏరియా జిఎం జి దేవేందర్ కోరారు. ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మెడికల్ ఇన్ వాలిడేషన్ ద్వార నూతనంగా ఉద్యోగాలు పొందిన డిపెండెంట్లు 8 మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏరియాలో ఇప్పటివరకు కారుణ్య నియామకాల ద్వార 1806 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఇతర పరిశ్రమలతో పోలిస్తే సింగరేణిలో పని స్థలాలు సమయాలు భిన్నంగా ఉంటాయని విధులకు గైర్హాజరు అయితే ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని దీనిని దృష్టిలో పెట్టుకొని నూతన కార్మికులు క్రమం తప్పకుండా విధులకు హాజరై అధిక బొగ్గు ఉత్పత్తికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ఓటు జిఎం విజయ్ ప్రసాద్, ఏఐటీయూసీ ఏరియ బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, సిఎంఓఏఐ అధ్యక్షులు రవి, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, డివైపిఎం సత్యబోస్, రాజ లింగు (ఒఎస్), ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, నాయకులు పాల్గొన్నారు.