calender_icon.png 8 January, 2025 | 7:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

9న కొత్త విద్యుత్ పాలసీ

07-01-2025 12:30:10 AM

  1. రాష్ట్రాన్ని విద్యుత్ మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం
  2. ఒడిశా నైనీ బ్లాక్‌ను సింగరేణికి అప్పగించి తీరుతాం..
  3. బ్లాక్ పక్కనే థర్మల్ పవర్ ప్లాంట్ నెలకొల్పుతాం..
  4. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క
  5. జెన్కో ఏఈలకు ఉద్యోగ నియామక పత్రాల పంపిణీలో స్పష్టీకరణ

హైదరాబాద్, జనవరి 6(విజయక్రాంతి): రాష్ట్రప్రభుత్వం ఈ నెల 9న కొత్త విద్యుత్ పాలసీని ప్రకటిస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క స్పష్టం చేశారు. తెలంగాణను పదేళ్ల పాటు పాలించిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎనర్జీ పాలసీ తీసుకు రాలేకపోయిందని విమర్శించారు.

హైదరాబాద్‌లోని సచివాలయం ఎదుట ఉన్న రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద సోమవారం టీఎస్ జెన్కో పరిధిలో ఏఈ కొలువులు సాధించిన 315 మం ది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసి మాట్లాడారు. ఇప్పటికే తాము అనేక రాష్ట్రాల్లో అమలవుతున్న ఎనర్జీ పాలసీలపై అధ్యయనం చేశామన్నారు.

రాష్ట్రాన్ని మిగు లు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ధ్యేయమని ప్రకటించారు. 2030 నాటికి రాష్ట్రం లో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 22,448 మెగావాట్లు ఉంటుందని అంచనా వేస్తున్నామని, అందుకు తగిన విధంగా పాలసీ రూపొందిస్తున్నామని వెల్లడించారు. దీనిలో భాగం గానే 20వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేసేందుకు సిద్ధమైనట్లు వివరించారు.

రామగుండంలో జెన్కో సింగరేణి సంయుక్త ఆధ్వర్యంలో థర్మల్ పవర్ ప్రాజెక్టు నెలకొల్పుతామని వెల్లడించారు. గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఒడిశాలోని నైనీ బ్లాకును పట్టించుకోలేదని మండిపడ్డారు. తాము ప్రత్యేకంగా చొరవ తీసుకుని నైనీ కోల్ బ్లాక్‌ను సింగరేణి యాజమాన్యానికి అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నైైనీ కోల్ బ్లాక్ పక్కనే థర్మల్ పవర్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ నెలకొల్పే ఆలోచనలో ఉన్నామని వివరించారు.

జీఎస్డీపీలో ఇంధన శాఖ కీలక పాత్ర.. 

తెలంగాణ జీఎస్డీపీ పెరుగుదలలో ఇంధ న శాఖ ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు డిప్యూ టీ సీఎం పేర్కొన్నారు. నిమిషం అంతరా యం లేకుండా ఏడాది కాలంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. కానీ తమపై బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్ విమర్శలను ప్రజలు నమ్మడం లేదన్నారు.

రాష్ట్రంలో చదువుకున్న ప్రతి బిడ్డకూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో నిరుద్యోగులను పట్టించుకోలేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, వెంటనే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశామన్నారు. జాబ్ క్యాలెండర్ సైతం ప్రకటించినట్లు తెలిపారు.

ఏడాదిలో 56,000 మందికి ఉద్యోగ నియామక పత్రా లు అందజేశామని వివరించారు. అనంత రం డిప్యూటీ సీఎం సింగరేణి రూపొందించిన చెమట చుక్కలకు తర్ఫీదు లోగోను ఆవిష్కరించారు. కోల్‌బెల్ట్ వ్యాప్తంగా యువతకు అండగా నిలుస్తున్న సింగరేణి యాజ మాన్యాన్ని అభినందించారు.

కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, షబ్బీర్ అలీ, రాష్ట్ర ఇంధనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానీయా, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్, సింగరేణి సీఎండీ బలరాం నాయక్, జెన్కో డైరెక్టర్లు పాల్గొన్నారు.