calender_icon.png 11 April, 2025 | 12:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగరంలో నయా డ్రగ్స్ దందా

06-04-2025 12:47:29 AM

నైజీరియా వయా హైదరాబాద్

అమెరికా నుంచి భారత్‌కు చెందిన వారి ఖాతాల్లోకి నగదు బదిలీ

వాటిని నైజీరియాకు హవాలా ద్వారా తరలింపు

ఇద్దరు నైజీరియన్లు సహా నగరవాసి అరెస్ట్

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): నగరంలో నయా డ్రగ్స్ దందా బయటపడింది. నైజీరియా నుంచి హైదరాబాద్‌కు, ఇక్కడి నుంచి అమెరికాకు డ్రగ్స్ సరఫరా చేసి వాటి ద్వారా వచ్చిన డబ్బులను నైజీరియాకు పంపించే ముఠా సభ్యులను టీజీఎన్‌ఏబి పోలీసులు అరెస్టు చేశారు. శనివారం టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య వివరాలను వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు సైబరాబాద్ నార్కోటిక్, తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు హైదరాబాద్‌లోని ఉప్పర్‌పల్లి, రాజేంద్రనగర్‌లో తనిఖీలు నిర్వహించి నైజీరియాకు చెందిన ప్రధాన నిందితుడు ఎబుక అలియాస్ లేబుక, అలియాస్ ఇమ్మానియేల్, చిక్కు ఒగ్బొన్న అలియాస్ బిగ్ జాయ్ అనే నైజీరియన్లను పట్టుకున్నా రు.

వారితో పాటు హైదరాబాద్ ఓల్డ్ మలక్‌పేటకు చెం దిన మహమ్మద్ మతిన్ సిద్ధికిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.12.50 లక్షల విలువైన కొకైన్, ఎండిఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నైజీరియా వ్యక్తులకు హైదరాబాద్, బెంగళూరు, అమెరికా సహా అంతర్జాతీయ డ్రగ్స్ నెట్‌వర్క్ కలిగి ఉన్నట్లు, కొకైన్ ఎండిఎం సహా వివిధ రకాల డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ విక్రయించేందుకు , డబ్బులు వసూలు చేసేందుకు వేర్వేరుగా వ్యక్తులను నియమించుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ముంబై, ఢిల్లీలో షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి వాటి ఖాతాల ద్వారా లావాదేవీలు జరుపుతున్నట్లు గుర్తించారు.

మూడు నెలల పాటు లావాదే వీలను పరిశీలించాక వీరిని పట్టుకున్నారు. డ్రగ్స్ విక్రయించడం ద్వారా అమెరికా వినియోగదారుల నుంచి భారత్‌కు చెందిన పలువురి ఖాతాల్లోకి డబ్బులు బదిలీ చేయించుకొని నైజీరియాలో వ్యాపారాలు నిర్వహించారు. టోలీచౌకీ ప్రాంతానికి చెందిన ఓ మ హిళను అరెస్టు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఆమె బ్యాంకు లావాదేవీలపై అనుమానం వచ్చి మూ డు నెలలు నిఘా వేయడంతో ఈ విషయాలు బ యటకు వచ్చాయి. ఐదేళ్లుగా వీరు అమెరికా, భారత్, నైజీరియా మధ్య కోట్లాది రూపాయల లావాదేవీలు జరిపినట్లు పోలీసులు నిర్ధారిస్తున్నారు.ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు మరో తొమ్మిది మం ది కోసం గాలిస్తున్నారు. నిందితులు డార్క్ వెబ్, ఫారెక్స్ మనీ ఏజెంట్ల ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నట్లు గుర్తించారు.