calender_icon.png 6 February, 2025 | 4:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెనోవా ఆస్పత్రిలో కొత్త విభాగాలు

06-02-2025 01:11:01 AM

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్, రోబోటిక్ సర్జరీ విభాగాన్ని ప్రారంభించిన మంత్రి పొంగులేటి 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): రెనోవా ఆస్పత్రిలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్, రోబోటిక్ సర్జరీ విభాగం ప్రారంభమైంది. తెలంగాణలో మొట్టమొదటిసారిగా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో గల రెనోవా సెంచురీ హాస్పిటల్‌లో ఈ సర్జరీ విభాగం అందుబాటులోకి వచ్చింది.

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఈ విభాగాన్ని ప్రారంభించారు. ఈ విభాగం ప్రారంభోత్సవ ఆఫర్‌గా 100 రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలను ఉచితంగా చేస్తామని ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. తన తల్లి, అత్తలకు రెనోవా ఆసుపత్రిలోనే మోకీలు మార్పిడి ఆపరేషన్లు జరిగాయని వెల్లడించారు.

ప్రజా సేవపై దృష్టి పెట్టే సంస్థల్లో రెనోవా గ్రూప్ మొదటిదని ప్రశంసించారు. రెనోవా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ , రోబోటిక్ సర్జరీ విభాగంలో తనతో పాటు నలుగురు నిపుణులైన వైద్యులు సేవలు అందిస్తామని డాక్టర్ ఏబీ సుహాస్ మసిలామణి తెలిపారు.

కార్యక్రమంలో ఎంపీలు రఘురామ్‌రెడ్డి, బలరాం నాయక్, ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, తెలంగాణ ఐడీసీఎల్  ఛైర్మన్ విజయ్ బాబు, రెనోవా ఆస్పత్రుల ఎండీ, సీఈవో డాక్టర్ శ్రీధర్ పెద్దిరెడ్డి, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, చైర్మన్ కార్డియాక్ సెన్సైస్ డాక్టర్ బి.కె.ఎస్.శాస్త్రి, చీఫ్ ఆఫ్ న్యూరాలజీ డా. జె.ఎం.కె.మూర్తి,

కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ ఆంకోసర్జన్ డాక్టర్ హిమాకాంత్ లింగాల, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ చీఫ్ ట్రామా సర్జన్ డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి గుర్రం, కన్సల్టెంట్ షోల్డర్ స్పోర్ట్స్ సర్జన్ డాక్టర్ అనూప్ రెడ్డి సామ, రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పటల్స్ సీవోవో రవీంద్రనాథ్ గరగ, రెనోవా సెంచరీ ఆఫ్ హాస్పటల్స్ హెచ్‌సీఓఓ  కృష్ణ, రెనోవా సెంచరీ హాస్పిటల్స్‌తో పాల్గొన్నారు.