calender_icon.png 27 January, 2025 | 10:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సివిల్స్ అభ్యర్థులకు కొత్త కోర్సు

22-01-2025 01:07:27 AM

  1. నాలుగేండ్ల బీఏ ఆనర్స్ తెలుగు 
  2. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు

హైదరాబాద్, జనవరి 21 (విజయక్రాంతి): సివిల్స్ ఆశావహుల కోసం సరి కొత్త కోర్సును తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రవేశ పెట్టబోతోంది. సివిల్స్ ను లక్ష్యంగా ఎంచుకొని, పైగా తెలుగు ఆప్షన్‌తో సివిల్స్ మెయిన్స్ రాయాలనుకునేవారికి ఇది మంచివార్త అని చెప్పా లి. బీఏ తెలుగు ఆనర్స్ డిగ్రీ కోర్సును అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

ఇం దులో ప్రవేశం పొందితే నాలుగేండ్లల్లో డిగ్రీ పట్టాతోపాటు సివిల్స్‌కు సమాంతరంగా ప్రిపేరయ్యినట్టే. సివిల్స్‌కు సంబం ధించిన సబ్జెక్టులే ఇందులో దాదాపుగా ఉంటాయి. ఇలాంటి డిగ్రీ కోర్సు వచ్చే విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకిరానుంది. ఓయూ ఆర్ట్స్ కాలేజీ సహా మరికొన్ని అటానమస్ కాలేజీల్లో ఈ కోర్సును ప్రవేశపెట్టాలని ఉన్నతవిద్యామండలి అ ధికారులు భావిస్తున్నారు.

కొన్ని రాష్ట్రాల విద్యార్థులు ప్రాంతీయ భాషలను ఎంచుకుని సక్సెస్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు ఆప్షన్‌తో సివి ల్స్ రాసే వారిని, తెలుగు వారిని ప్రోత్సహించడంలో భాగంగా  కోర్సును అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ఉన్న త విద్యామండలి వైస్‌చైర్మన్ ప్రొఫెసర్ పురుషోత్తం తెలిపారు. రాష్ర్టంలో ఇప్పటికే బీఏ పొలిటికల్ సైన్స్, బీఏ ఎకనామిక్స్ కోర్సులను అటానమస్ కాలేజీల్లో ప్రవేశపెట్టారు. తర్వాత ఇంజినీరింగ్‌తో సమానమైన బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సు ప్రవేశపెడుతామన్నారు.