calender_icon.png 26 December, 2024 | 10:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిమదాస్ సస్పెన్షన్‌పై గందరగోళం

25-12-2024 11:00:02 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): ఆసియా గేమ్స్ స్వర్ణ పతక విజేత, స్ప్రింటర్ హిమదాస్‌పై విధించిన సస్పెన్షన్ వేటుపై గందరగోళం నెలకొంది. నేషనల్ డోపింగ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా)కి తన ఆచూకీ వివరాలు వెల్లడించడంలో విఫలమైన హిమదాస్‌పై క్రీడల్లో పాల్గొనకుండా నాడా 16 నెలల పాటు వేటు వేసింది. ఈ సస్పెన్షన్ వేటు గతేడాది జూలై 22 నుంచి ఈ ఏడాది నవంబర్ 21 వరకు ఉంది. అయితే నవంబర్ 21తో హిమదాస్‌పై సస్పెన్షన్ వేటు తొలగినప్పటికీ నాడా ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఆమె గేమ్స్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. హిమదాస్‌కు ‘ఢింగ్ ఎక్స్‌ప్రెస్’ అని ముద్దుపేరు ఉంది.