calender_icon.png 22 February, 2025 | 12:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే పాయంను కలిసిన టిప్పర్ ఓనర్ అసోసియేషన్ నూతన కమిటీ

21-02-2025 07:34:07 PM

మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రజా భవన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జై సింగరేణి 14 టైర్ టిప్పర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లను శుక్రవారం కలిశారు. పూల బొకే అందజేసే శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నూతన అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి, సెక్రటరీ నాగభూషణం, ట్రెజరర్ శాంతి కుమార్ లు కమిటీ సభ్యులను ఎమ్మెల్యే పాయంకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ... నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. టిప్పర్ లారీ ఓనర్ల సంక్షేమానికి అసోసియేషన్ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, 14 టైర్ టిప్పర్ ఓనర్స్, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.