calender_icon.png 18 March, 2025 | 6:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాల్వంచ ప్రెస్ క్లబ్ కు నూతన కమిటీ ఎన్నిక..

17-03-2025 10:43:37 PM

పాల్వంచ (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రెస్ క్లబ్ కు నూతన కమిటీకి జరిగిన ఎన్నికలు సోమవారం ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ప్రెస్ క్లబ్ రిజిస్టర్ నెంబర్ 43/2019 ఎన్నికలు స్థానిక ప్రెస్ క్లబ్ లో నిర్వహించగా అబ్జర్వర్ గా రిటైర్డ్ లెక్చరర్ ప్రముఖ వ్యాఖ్యాత నరసరావు కుమార్ వ్యవహరించారు. ఎన్నికల కన్వీనర్ గా వేముల కొండలరావు సీనియర్ పాత్రికేయులు జైనుల్లా బుద్దిన్ ఎన్నికల ప్రక్రియను కొనసాగించారు. అధ్యక్షుడిగా అబ్బురం ఉపాధ్యక్షుడిగా జగదీష్, ప్రధాన కార్యదర్శిగా లెనిన్ సహాయ కార్యదర్శిగా శ్రీనివాస్ కోశాధికారిగా వీరగవ్వభద్రం ఎంపికయ్యారు. కృష్ణమూర్తి రామకృష్ణ, నరసింహారావు శ్రీనివాసరావు తదితర సీనియర్ పాత్రికేయులు నూతనంగా ఎన్నిక కాబడిన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పాల్గొన్నారు.