calender_icon.png 16 January, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిలో సీఎన్ జీ తో 32 కిలోమీటర్లు.. సరికొత్త స్విఫ్ట్

12-09-2024 05:21:52 PM

హైదరాబాద్: భారత్ లో అత్యధిక ఆదరణ పొందిన హ్యాచ్ బ్యాక్ మోడల్ కార్లలో మారుతి సుజుకీ స్విఫ్ట్ ఒకటి. ఈ మాడల్ లో సీఎన్జీ వేరియెంట్ ను మారుతీ తాజాగా లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ.8.19 లక్షలు గా కంపెనీ నిర్ణయించింది. అధిక ఇంధన సామర్థ్యంతో దీన్ని తీసుకొచ్చింది. కొత్త సీఎన్జీ రాక తో మారుతి పోర్ట్ ఫోలియోలో మొత్తం 14సీ ఎన్జీ మోడల్స్ ఉన్నాయి. మారుతీ సుజుకీ కొత్త స్విఫ్ట్ సీఎన్ జీ వేరియొంట్ లో 1.2 లీటర్ల జెడ్ సిరీస్ డ్యూయల్ వీవీటీ ఇంజెన్ అమర్చారు. ఈ ఇంజన్69.75psశక్తిని,101.8Nmపీక్..టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కిలో సీఎన్ జీ ఇంధనంతో 32 కిలోమీటర్లు..మైలేజీని ఇస్తుందని కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు.