calender_icon.png 20 October, 2024 | 12:47 AM

కొత్త సీజేఐ సంజీవ్ ఖన్నా?

18-10-2024 02:47:06 AM

  1. ఆయన పేరును సూచించిన సీజేఐ చంద్రచూడ్
  2. కేంద్రం అభ్యర్థనతో వారసుడి పేరు సిఫారసు

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: భారత కొత్త ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాను నియమించాలని ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. వచ్చే నెల 8వ తేదీన జస్టిస్ చంద్రచూడ్ పదవీ విరమణ చేయనున్నారు.

దీంతో కొత్త సీజేఐకి ఒకరి పేరును సూచించాలని ఆయనను కేంద్ర ప్రభుత్వం గత శుక్రవారం కోరింది. దీంతో ప్రస్తుతం సుప్రీంకోర్టులో తన తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును సూచిస్తూ చంద్రచూడ్ గురువారం కేంద్రానికి లేఖ రాశారు.

ఈ సిఫారసును కేంద్రం ఆమోదిస్తే జస్టిస్ ఖన్నా భారత 51వ ప్రధాన న్యాయమూర్తి అవుతారు. అయితే ఆయన పదవీకా లం ఆరు నెలలు మాత్రమే ఉంటుం ది. వచ్చే ఏడాది మే 13వ తేదీన ఆయన పదవీ విరమణ చేస్తారు. 

న్యాయశాస్త్ర కోవిధుడు

జస్టిస్ సంజీవ్ ఖన్నా భారత న్యాయవ్యవస్థలో గొప్ప మేధావిగా పేరు తెచ్చుకొన్నారు. 1983లో ఆయ న ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో ఎన్‌రోల్ చేసుకొన్నారు. తీస్ హజారీ జిల్లా న్యాయ స్థానంలో కెరీర్ ప్రారంభించారు. కొం త కాలానికే ఢిల్లీ హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. 2005లో ఢిల్లీ హై కోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమించబడ్డారు. 2006లో శాశ్వ త న్యాయమూర్తిగా పదోన్నతి పొందా రు.

ఢిల్లీ జ్యుడీషియల్ అకాడెమీ, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్, డిస్ట్రిక్ట్ కోర్ట్ మీడియేషన్ సెంటర్లకు చైర్మన్‌గా, జడ్జ్ ఇన్‌చార్జిగా సేవలందించారు. 2019 జనవరి 18న సుప్రీంకో ర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఏ హైకోర్టులోనూ ప్రధాన న్యాయమూర్తిగా చేయకుండానే నేరు గా సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందటం విశేషం.