హీరో రవితేజ, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు. ఆయన కంపోజ్ చేసిన పాటలన్నీ ప్రేక్షకాదరణ పొందుతున్న తరుణంలో ఆయన శనివారం విలేకరులతో ముచ్చటించారు. ఆ ముచ్చట్లు ఆయన మాటల్లోనే.. “మిస్టర్ బచ్చన్’ మ్యూజిక్‌కు ఇంత మంచి రెస్పాన్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది. సాంగ్స్ అన్ని ఆడియన్స్‌కు చాలా నచ్చాయి. ఇదొక సర్ర్పైజ్. -ఈ మాస్ సాంగ్స్ చేయడం నాకేం షాకింగ్‌గా లేదు. ఇలాంటివి చేయగలనని నాకు తెలుసు. నేను మాస్, క్లాస్ అని అలోచించను. సాంగ్స్ అనేవి స్క్రిప్ట్ ప్రకారమే వస్తాయి. హరీశ్ కిషోర్‌కుమార్‌కు బిగ్ ఫ్యాన్. నేనూ ఆ సాంగ్స్ వింటూ పెరిగా. ఈ సినిమాలోని పాటలన్నిటికీ కొత్త బీట్స్, బ్యాకింగ్ యాడ్ చేసి కొంచెం యాంప్లిఫై చేశాం. -నేను చాలా ఫాస్ట్‌గా కంపోజ్ చేస్తా” అని చెప్పారు.