calender_icon.png 25 December, 2024 | 7:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనవరి చివర్లో కొత్త సారథి!

25-12-2024 01:45:18 AM

  1. కాంగ్రెస్‌కు కౌంటర్‌గా కమలదళం నిరసనలు! 
  2. పార్టీ సంస్థాగత ఎన్నికలపైనా విస్తృతంగా చర్చ
  3. ఎంపీలు, ఎమ్మెల్యేలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సమావేశం

హైదరాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): త్వరగా పార్టీ సంస్థాగత ఎన్నిక లను ముగించి రాష్ట్ర అధ్యక్షుడిని ఎంపిక చేసే అంశంపై తెలంగాణ బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తోంది. సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఇంచార్జి సునీల్ భన్సల్ ఆధ్వర్యంలో రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎ మ్మెల్యేలతో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో పార్టీ సభ్యత్వాలపైనా చర్చ జరిగిందని పార్టీ నేతలు తెలిపారు. ముఖ్యంగా సం స్థాగత ఎన్నికలు బాగా ఆలస్యం కావడంపై ప్రధానంగా చర్చించినట్టు సమాచా రం. ఇప్పటికే బూత్ స్థాయి ఎన్నికలు పూర్తయినా..  ఇంకా మండల, జిల్లా స్థాయి కమిటీల ఎన్నికలు పూర్తి కాలేదు. సంక్రాంతి లోపు మండల స్థాయి, జిల్లా స్థాయి ఎన్నికలను పూర్తి చేసి జనవరి నెలాఖరు నాటికి రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక పూర్తి చేయాలని పార్టీ అధిష్ఠానం భావిస్తున్నట్టు స మాచారం.

మరోవైపు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిరసనలు రాష్ట్రంలోనూ కొనసాగుతున్న నేపథ్యంలో బీజే పీ నాయకులు సైతం అందుకు తగ్గట్టు గా కౌంటర్ నిరసనలు చేసేందుకు ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఈ స మావేశంలో ఆ అంశంపైనా చర్చ జరిగిందని పార్టీ నేతలు చెప్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు ఏవిధంగా అన్యాయం చేసిందనే అంశాలను, రాహుల్‌గాంధీ రాజ్యాంగాన్ని పలుమార్లు అవమానించేలా వ్యవహరిం చారనే విషయాన్ని ప్రధానం గా తీసుకుని నిరసనలను తెలిపేందుకు కమలనాథులు సిద్ధమవుతున్నట్టు సమాచారం. మంగళవారం నాటి సమావేశం లో ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్‌రావు, గొడాం నగేశ్, ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి సహా పార్టీ నేతలు పాల్గొన్నారు.