calender_icon.png 16 November, 2024 | 7:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త బస్సులు కొనుగోలు చేయాలి

06-07-2024 12:00:00 AM

తెలంగాణ ఆర్టీసీ బస్సుల కొరతను అధిగమించాల్సిన అవసరాన్ని గుర్తించాలి. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ఎక్కువ బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకోవాలి. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కారణంగా ప్రస్తుతం ప్రతి బస్సులో కెపాసిటీకి మించి ప్రయాణికులు ఎక్కుతున్నారు. దీనివల్ల బస్సులు గమ్య స్థానం చేరలేక మధ్యలోనే ఆగిపోతున్నాయి. అంతేకాదు, జనం ప్రమాదకర స్థితిలో వేళ్లాడుతూ ప్రయాణం చేయాల్సి వస్తోంది. దీని కి తోడు చాలా బస్సులు పాతవి కావడంతో ఎప్పుడు ఎక్కడ ఆగిపోతాయో, ప్రమాదాలు జరుగుతాయోననిపించే స్థితిలో ఉంటు న్నాయి. కాలం చెల్లిన బస్సుల కారణంగా ప్రయాణాలు చేయాలంటేనే జనం భయపడిపోతున్నారు. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉంది. కొత్త బస్సులను కొనుగోలు చేసి ప్రతి డిపోకు అదనపు బస్సులను కేటాయించాలి.సౌకర్యవంతంగా, భద్రంగా ప్రయాణికులు గమ్యస్థానం చేరే పరిస్థితి ఉంటేనే ఆర్టీసీ నష్టాలను అధిగమిం చి లాభాల బాటలో పరుగులు పెడుతుంది. రవాణా శాఖ మంత్రి, ఎండి ఈ విషయంపై దృష్టిపెడితే బాగుంటుంది.

 షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్.