02-04-2025 11:00:51 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని బెల్లంపల్లి బస్తి (19వ వార్డులో) త్రాగునీటి సమస్య తీవ్రంగా మారిన విషయాన్ని ఎమ్మెల్యే గడ్డం వినోద్ దృష్టికి స్థానిక వార్డులోని కాంగ్రెస్ నాయకులు తీసుకెళ్లడంతో ఆయన స్పందించారు. త్రాగునీటి సమస్య పరిష్కారానికి ఆయన చొరవ చూపారు. 19వ వార్డులో నూతన బోర్ వెల్ వేయించారు. బుధవారం సాయంత్రం స్థానిక కాంగ్రెస్ నాయకులు బోర్ వెల్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య, మాజీ కౌన్సిలర్ కొమ్ముల సురేష్, 19వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు మొహమ్మద్ ఆసిఫ్, కదీర్ మీర్జా, అబ్దుల్ జాబి, సదానందం, అల్లం కిషన్ తో పాటు బస్తి ప్రజలు పాల్గొన్నారు.