calender_icon.png 1 April, 2025 | 8:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి గ్రంధాలయంలో నూతన పుస్తకాల ఆవిష్కరణ

29-03-2025 10:40:10 PM

ఇల్లెందు (విజయక్రాంతి): సింగరేణి ఇల్లందు ఏరియా సి.ఇ.ఆర్.క్లబ్ జెకె కాలనీ లో ఉన్నటువంటి సింగరేణి సేవా సమితి ద్వారా నిర్వహిస్తున్న గ్రంధాలయంలోకి నూతన పుస్తకాలను శనివారం జియం కార్యాలయంలో జియం వి. కృష్ణయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణిలో ఇంటర్నల్, ఎక్స్ టర్నల్ అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా విడుదల అయ్యే అన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు, స్టడీ మెటీరియల్, తెలుగు దిన పత్రికలతో పాటు తెలంగాణా చరిత్ర, జనరల్ నాలెడ్జ్, కంప్యూటర్, పోటీ పరీక్షలకు సంబంధించిన గ్రూప్-1,2,3,4, ఎస్.ఐ, కానిస్టేబుల్, ఆర్మీ, టేట్, డియస్సి, అలాగే వ్యక్తిత్వ వికాసం, పురాణ ఇతిహాసాలు, క్రీడలకు సంబంధించిన వివిధ రకాల  పుస్తకాలు ఈ గ్రంథాలయం లో అందుబాటులో ఉన్నాయన్నారు.

ఈ గ్రంధాలయం  ప్రతి రోజు ఉదయం 9.30 ని.ల నుండి మధ్యాహ్నం 1.00గం. వరకు, సాయంత్రం 5.30 ని.ల నుండి 7.30 ని.ల వరకు రీడర్స్ సౌకర్యార్థం అందుబాటులో ఉంటుందని అన్నారు. కావున ఆసక్తి గల ఉద్యోగులు విద్యార్ధిని విద్యార్థులు, సింగరేణి పరిసర ప్రాంత గ్రామాలకు చెందిన ప్రాజెక్ట్ ప్రభావిత, పునరావాస కుటుంబాల నిరుద్యోగ యువతి యువకులు వినియోగించు కోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జీఎం రామస్వామి, ఏజీఎం ఐఈడీ గిరిధర్ రావు, ఏరియా ఇంజినీరు ఆర్వీ నరసింహరాజు, డిజిఎం పర్సనల్ జీవి మోహనరావు, గుర్తింపు సంఘం ఉపాధ్యక్షుడు రాజారాం, సింగరేణి సేవా సమితి సమన్వయ కర్త కోట సాంబయ్య, గ్రంథాలయ సంరక్షకుడు విగ్నేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.