21-04-2025 12:00:00 AM
పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ అధికారుల వింత వైఖరి
పర్మిషన్లు రెసిడెన్షియల్.. నిర్మాణాలు కమర్షియల్
ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టుతున్న అక్రమార్కులు
అబ్దుల్లాపూర్‌మెట్, ఏప్రిల్ 20: పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ అధికారులు అక్రమార్కులకు “కొత్త దారులు వేస్తున్నారు. అ క్రమ నిర్మాణదారులకు అధికారులు వత్తా సు పలుకుతూ.. వింత వైఖరి ప్రదర్శిస్తున్నా రు. రెసిడెన్షియల్ పర్మిషన్లు తీసుకొని.. కమర్షియల్ నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ కమర్షియల్ నిర్మాణాలకు మున్సిపల్ అధికారులు పూర్తి స్థాయి సహకారులు అందిస్తు న్నట్లు తీవ్రంగా ఆరోపణలొస్తున్నాయి. దీం తో ప్రభుత్వానికి పన్నుల రూపంగా రావాల్సిన ఆదాయాన్ని అక్రమార్కుల పాటు అధికారులు కూడా గండికొడుతున్నారు. ఉ దా రెసిడెన్షియల్ పర్మిషన్లు తీసుకుంటే.. రూ. 100 అయితే... కమర్షియల్ పర్మిషన్లు వెళ్లినప్పుడు రూ. 1000 అవుతాయి.. అంటే దాదాపు రూ. 900లు ప్రభుత్వాన్ని రావాల్సిన ఆదాయాన్ని తూట్లుపొడుస్తున్నారు.
అక్రమార్కులు ఇచ్చే తాయీలాలకు అధికారులు అలవాటు పడి... మున్సిపాలిటీ పరిధి లో అక్రమ నిర్మాణాలను అడ్డుకోలేక పోతున్నారు. పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలో ఇలాంటి అక్రమ నిర్మాణాలు కోకొల్లలుగా వెలుస్తూ వస్తున్నాయి. పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ పరిధి తట్టిఅన్నారం గ్రామ సర్వే నెంబర్ 105లో ఎలాంటి పర్మిషన్లు లేకుండా భారీ ఎత్తున అక్రమంగా షెడ్డు నిర్మిస్తున్నారు.
ఇవే కాదు ఇలాంటి అక్రమ నిర్మాణాలు చాలానే ఉన్నాయి. అక్ర మ నిర్మాణాలపై స్థానికుల నుంచి ఫిర్యాదులు అందుతున్న స్పందించడం లేదు. స్పందించిన నోటీసులు అందించి... చేతులు తడుపుకుని బయట పడుతున్నట్లు స్థానికులు నుంచి ఆరోపణాలు వస్తున్నాయి. అక్ర మ నిర్మాణాలకు స్థానిక మాజీ ప్రజాప్రతినిధుల అండదండలు ఉండడం అక్రమార్కుల ఇచ్చే తాయీలాలపై అధికారులు ఆశపడుతుండడంతో ప్రభుత్వానికి భారీ గండిపడుతుంది.
అధికారులకు చలనం లేదు
పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలో జరిగే అక్రమ నిర్మాణాలపై ఎప్పటికప్పుడు స్థానికులు అధికారులు దృష్టి తీసుకొస్తున్నా.. అధికారులలో ఎలాంటి చలనం లేదు. ఇప్పటికైనా అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తాం. అదే విధంగా మున్సిపాలిటీలో జరిగే తతంగాన్నిసంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తం. యంజాల ప్రహ్లాద్, బీఎస్పీ నాయకులు పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ
పరిశీలించి చర్యలు తీసుకుంటాం
మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలను పూర్తిస్థాయిలో పరిశీలిస్తాం. నిబంధన లకు విరుద్ధంగా ఎవరైనా అక్రమ నిర్మాణా లు చేపడితే వారిపై చర్యలు తీసుకుంటాం.
_ ఎస్ రవీందర్ రెడ్డి, కమిషనర్ పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ