ప్రారంభ ధర రూ.88.66 లక్షలు
బెంగళూరు, నవంబర్ 28: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ ఆడి కొత్తగా క్యూ7 మోడల్‌ను భారత్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ప్రారంభ ధర రూ.88,66,000కాగా, ప్రీమియం ప్లస్ వేరియంట్ ధర రూ. 97,81,000 (ఎక్స్ షోరూమ్). 3.0 ఎల్‌వీ6 ఇంజిన్ కలిగిన క్యూ7లో డిజిటల్ కాక్‌పిట్, 3డీ సౌండ్ సిస్టమ్, అడ్వాన్స్‌డ్ సేఫ్టీ తదితర లగ్జరీ ఫీచర్లు ఉంటాయి.