calender_icon.png 1 February, 2025 | 3:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనంతగిరికి కొత్త కళ

01-02-2025 12:10:40 AM

  • ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ స్వదేశీ దర్శన్ పథకంలో ఎంపిక 
  • ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో రూ. 1000 కోట్లతో అభివృద్ధికి ఎంఓయు 
  • కుదుర్చుకున్న మేఘ సంస్థ ఇప్పటికీ డిపిఆర్ సిద్ధం చేసిన ఎల్‌ఎ న్ టి సంస్థ 

వికారాబాద్, జనవరి 31: వికారాబాద్ జిల్లా కేంద్రానికి అతి చెరువులో ఉన్న అనంతగిరి అభివృద్ధి పై అడుగులు ముందుకు పడుతున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం  స్వదేశీ దర్శన్ పథకంలో ఎంపిక చేయగా, తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన సందర్భంగా అనంతగిరి అభివృద్ధికి మేఘ సంస్థ రూ. 1000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.

ఈ మేరకు ప్రభుత్వంతో ఎం ఓ యు కూడా కుదుర్చుకోవడంతో స్థానికులకు అనంతగిరి అభివృద్ధి పై ఆశలు రెట్టింపు అయ్యాయి. స్వదేశీ దర్శన్ పథకంలో ఎంపిక కావడంతో గత ఆరు నెలల క్రితం డిపిఆర్ తయారీ బాధ్యతను ఎల్‌ఎన్‌టి సంస్థకు అప్పగించారు.

అనంతగిరి పర్యాటకం అభివృద్ధిపై ఎల్‌ఎ న్‌టి  సంస్థ ఇప్పటికే రెండుసార్లు ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. అనంతగిరి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని అందుకు మొదటి విడతగా రూ. 33 కోట్లు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇటీవలే  స్పష్టం చేశారు.  అనంతగిరి చుట్టూ కొండలు, అటవీ ప్రాంతం, ప్రాజెక్టులు ఉండటంతో పర్యాటకం మరింత సంతరించుకోనుంది. 

గత ఏడాది స్వదేశీ దర్శన్ లో ఎంపిక...

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వదేశీ దర్శన్ పథకం రెండవ విడత జాబితాలో యాదాద్రి అనంతగిరి ఎంపిక అయ్యాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా వీటిని అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే ఎల్ ఎన్ టి సంస్థ మాస్టర్ ప్లాన్ ప్రాజెక్టు తయారు  చేయడంతో సంబంధిత అధికారులు టెండర్లకు సిద్ధమవుతున్నారు. 

శని, ఆదివారాల్లో పర్యాటకుల సందడి..

అనంతగిరికి రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు అతి చెరువులో ఉండటంతో శని, ఆదివారాల్లో పెద్ద ఎత్తున పర్యాటకులు ఆధ్యాత్మిక క్షేత్రానికి వస్తుంటారు. విశాలమైన అడవి ప్రాంతం ఉండటంతో కార్తీక వనభోజనాలు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. ఇంత పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్న ప్రస్తుతo ఆశించిన మేర సౌకర్యాలు లేకపోవడం ఇబ్బంది కలిగిస్తుంది. అనంతగిరి అభివృద్ధి పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో అభివృద్ధిపై ఆశలు రెట్టింపు అయ్యాయి.

ప్రభుత్వం అనుకున్నట్లుగానే ముందుకు పోతే అనంతగిరి అడ్వెంచర్ టూరిజం స్పాట్ గా మారనుంది. సాధారణ పర్యాటక అభివృద్ధి కింద అడవుల అందాలు వీక్షించడం, ఆలయాల సందర్శన వంటివి అభివృద్ధి కానున్నాయి. అడ్వెంచర్ టూరిజం లో భాగంగా యువత బాగా ఇష్టపడే ట్రెక్కింగ్, సాహస కృత్యాల విభాగాలను అభివృద్ధి చేయనున్నారు.