calender_icon.png 29 November, 2024 | 5:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జగదీశ్ హత్యకేసులో కొత్తకోణం

29-11-2024 03:14:01 AM

చెట్టు కల్లులో మత్తుమందు కలిపి హత్య

అత్యంత రహస్యంగా పోలీసు విచారణ

నాగర్‌కర్నూల్, నవంబర్ 28 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి ఎంపీడీవో కార్యాలయ అటెండర్ చింతలపల్లి జగదీశ్ (35)ఈ నెల 24న దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అల్లీపూర్ శివారులోని కేఎల్‌ఐ కాల్వలో భర్త మృతదేహం బయటపడగా, పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకుని విచారణ ప్రారంభించారు. భార్య కీర్తి తన ప్రియుడు నాగ రాజుతో పాటు అతని స్నేహితులతో కలిసి దాడిచేసి హతమార్చినట్లు విచారణలో తేలింది. హత్యోదంతంలో పోలీసులు కొత్తకోణం వెలుగులోకి తీసుకొచ్చినట్లు తెలు స్తోంది.

చెట్టు కల్లులో మత్తు పదార్థం వాడి భర్త హత్యకు పథకం రచించినట్లు సమాచారం. గుడ్లనర్వ గ్రామానికి చెందిన ప్రియుడితో పాటు పాలెం గ్రామానికి చెందిన మరో ఇద్దరు ప్రియుడి స్నేహితులు హత్యోదంతంలో చేతులు కలిపినట్లు తెలిసింది. జిల్లాకేంద్రంలో నివాస ముంటున్న ఓ నకిలీ రిపోర్టర్ సాయంతో కల్తీ కల్లు తయారు చేసే వ్యక్తి నుంచి మత్తుమందు కొనుగోలు చేసినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. జగదీశ్ తాగే చెట్టు కల్లులో ఈ మత్తుమందు కలిపి, మత్తులోకి వెళ్లిన తర్వాత అతడిని హతమార్చినట్లు పోలీసుల విచారణంలో వెలుగు లోకి వచ్చినట్లు తెలిసింది.

దీనిలో భాగంగానే మరికొందరిని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. ఈకేసులో కొందరిని తప్పించేదుకు పోలీసులు యత్నిస్తున్నట్లు తెలుసు కున్న పోలీస్‌ఉన్నతాధికారులు సీరియస్ అయినట్లు తెలిసింది. దీంతో ఈ కేసు విచారణ అత్యంత రహస్యంగా జరుగుతోంది. ఇప్పటికీ పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.